టాస్ కాయిన్ పై అనుమానం – న్యూజిలాండ్ ప్లేయ‌ర్

న్యూజిలాండ్ జ‌ట్టు ఇండియా టూర్ లో టీ ట్వంటి, టెస్ట్ సిరీస్ లు ఆడుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సారి ఇండియా టూర్ లో న్యూజిలాండ్ జ‌ట్టు ఒక్క సారి కూడా టాస్ నెగ్గ‌లేదు. దీని పై న్యూజిలాండ్ ఆట‌గాడు జేమ్స్ నీష‌మ్ ఫన్నీ గా స్పందించాడు. నాలుగు మ్యాచ్ ల‌లో తాము ఒక్క సారి కూడా టాస్ గెల‌వ‌లేమ‌ని అన్నారు. ప్ర‌తి సారి టీమిండియా నే గెలుస్తుందని అన్నాడు.

త‌న‌కు టాస్ కాయిన్ పై అనుమానం వ‌స్తుంద‌ని త‌న సోష‌ల్ మీడియా లో కామెంట్ చేశాడు. ఎవ‌రైనా వెళ్లి టాస్ కాయిన్ ప‌రిశీలించాల‌ని ఫ‌న్నీ గా కామెంట్ చేశాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు న్యూజిలాండ్, ఇండియా మ‌ధ్య మూడు టీ ట్వంటిలు జ‌రిగాయి. ఒక టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ వేదిక గా జ‌రుగుతుంది. ఇందు లో ఒక్క సారి కూడా న్యూజిలాండ్ టాస్ నెగ్గ‌లేదు. అయితే టీ ట్వంటి మ్యాచ్ ల‌లో టాస్ కీల‌కం గా ఉండేది. టాస్ నెగ్గిన జ‌ట్టే విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉండేవి.