భ‌ళా రోహిత్ : వెస్టిండీస్ క్లీన్ స్వీప్.. మూడో మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం

-

సొంత గ‌డ్డపై రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించాడు. అలాగే తొలి వ‌న్డే సిరీస్ తోనే కెప్టెన్ గా విరాట్ కోహ్లిని స‌మం చేశాడు. తాను కెప్టెన్ గా వ్య‌వహ‌రిస్తున్న తొలి వ‌న్డే సిరీస్ ను రోహిత్ శ‌ర్మ ఘ‌నంగా ముగించాడు. మూడో వ‌న్డేలో టీమిండియా ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో 96 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఈ వ‌న్డే సిరీస్ లో వెస్టిండీస్ క్లీన్ స్వీప్ అయింది. దీంతో దాదాపు 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత సొంత గ‌డ్డ‌పై ఒక జ‌ట్టు క్లీన్ స్వీప్ అయింది. కాగ వెస్టిండీస్ తో జ‌రిగిన మూడో వ‌న్డే లో తొల‌త బ్యాటింగ్ చేసిన 265 ప‌రుగులు చేసింది. మిడిల్ ఆర్డ‌ర్లు.. శ్రేయ‌స్ అయ్యార్ (80), వికెట్ కీప‌ర్ రిషబ్ పంత్ (56) రాణించారు. అలాగే వెస్టిండీస్ బౌల‌ర్ హొల్డ‌ర్ నాలుగు వికెట్లు తీశాడు.

అనంత‌రం 266 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ కు ఆదిలోనే సిరాజ్ షాక్ ఇచ్చాడు. త‌న రెండో ఓవ‌ర్లోనే ఓపెన‌ర్ హోప్ ను అవుట్ చేశాడు. అనంత‌రం దీప‌క్ చాహార్ త‌న వ‌రుస ఓవ‌ర్ల‌లో ఇద్ద‌రిని అవుట్ చేశాడు. దీంతో 5 ఓవ‌ర్ల‌లో 25 ప‌రుగుల‌కు 3 కీల‌కమైన వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పురాన్ (34), ఓడియ‌న్ స్మిత్ (36) మిన‌హా మిగిత వాళ్లు భార‌త బౌల‌ర్ల దాటికి కుప్ప‌కూలారు. దీంతో 37.1 ఓవ‌ర్లోనే వెస్టిండీస్ ఆలౌట్ అయింది.

ప్ర‌సిద్ధ కృష్ణ‌, సిరాజ్ త‌ల 3 వికెట్లు తీసుకున్నారు. దీప‌క్ చాహ‌ర్, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్ల చొప్పున ప‌డ‌గొట్టారు. కాగ ఈ మ్యాచ్ లో 80 ప‌రుగులతో ఆదుకున్న శ్రేయ‌స్ అయ్యార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. అలాగే ఈ వ‌న్డే సిరీస్ లో బాల్ తో అద్భుతాలు సృష్టించిన ప్ర‌సిద్ధ కృష్ణ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ద‌క్కించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version