శ్రీ‌లంక‌పై విండిస్ ఓట‌మి! సెమీస్ రేస్ నుంచి అవుట్

టీ 20 ప్ర‌పంచ్ క‌ప్ టోర్న‌మెంట్ లో మ‌రొక జట్టు ఇంటి దారి ప‌ట్ట‌నుంది. గురువారం రాత్రి శ్రీ‌లంక , వెస్టిండిస్ జ‌రిగిన మ్యాచ్ లో వెస్టీండిస్ ఓట‌మి పాల‌యింది. దీంతో వెస్టీండిస్ సెమీస్ అవ‌కాశాలు నీరు గారాయి. దీంతో ఇంటి దారి ప‌ట్ట‌నుంది. ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ శ్రీ‌లంక నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 189 ప‌రుగులు చేసింది. 190 ప‌రుగుల టార్గ‌ట్ తో బ‌రిలోకి వెస్టిండీస్ జ‌ట్టు దిగింది.

వెస్టిండీస్ జట్టు బ్యాట‌ర్లు చేతులు ఎత్తేయ‌డం తో 20 ఓవ‌ర్ల‌లో 169\8 మాత్ర‌మే చేయ‌క‌లిగింది. దీంతో 20 ప‌రుగుల తేడాతో వెస్టిండీస్ ఓట‌మి పాల‌యింది. అయితే వెస్టిండీస్ జట్టు ఇప్ప‌టికీ నాలుగు మ్యాచ్ లు ఆడ‌గా కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచింది. ఇంకా ఒక మ్యాచ్ ఆడే అవక‌శం ఉన్నా.. ఆ మ్యాచ్ వెస్టిండీస్ గెలిచినా.. సెమీస్ వెళ్ల‌లేదు. దీంతో ఈ ఓట‌మి తోనే వెస్టిండీస్ జట్టు సెమీస్ అవశాలు ఆవిరి అయ్యాయి. అయితే గ్రూప్ 1 నుంచి బంగ్లాదేశ్ ఇంటి బాట ప‌ట్టింది. బంగ్లాదేశ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్ ల‌లో ఇక మ్యాచ్ లో కూడా విజ‌యం సాధించ లేక పోయింది.