రన్నింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చెయ్యద్దు..!

-

చాలా మందికి ప్రతి రోజు రన్నింగ్ చేసే అలవాటు ఉంటుంది. రన్నింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఫిట్ గా ఉండొచ్చు అనే కార్డియో వాస్క్యులర్ సమస్యల్ని తరిమికొట్టొచ్చు. ఎక్స్ట్రా క్యాలరీలను కరిగించుకోవడానికి రన్నింగ్ మనకు ఎంతో సహాయ పడుతుంది. అయితే చాలా మంది రన్నింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులు చేయడం వల్ల మోకాలు నొప్పి కలగడం ఇలాంటివి జరుగుతాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

 

రన్నింగ్ చేసేటప్పుడు మీరు వేసుకునే షూస్ సరిగా ఉన్నాయో లేదో గమనించడం చాలా ముఖ్యం. చాలా మంది ఇష్టం వచ్చినట్లు రన్నింగ్ చేస్తూ ఉంటారు. అయితే అన్నింటికీ ఒకే రకం షూస్ సెట్ కావు. అందుకనే రన్నింగ్ చేయడానికి తగిన షూ ని సెలెక్ట్ చేసుకోండి.

రన్నింగ్ కి సరిగ్గా ఫిట్ అయ్యే వాటిని మాత్రమే వేసుకోండి. అలానే నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు సరిగ్గా సపోర్ట్ ఉందో లేదో చూసుకోండి. లేదంటే మోకాళ్ళ సమస్యలు వస్తాయి. అదే విధంగా రన్నింగ్ చేసేటప్పుడు స్లిప్ అవ్వకుండా చూసుకుని వెళ్లాలి. లేదు అంటే ఏ వర్షం నీరు వల్లనో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఈ విషయాల్లో జాగ్రత్తగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news