WORLD CUP 2023: ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ? ఎక్కడ ?

-

ఇండియా లో మొత్తం 10 గ్రౌండ్స్ లో వన్ డే వరల్డ్ కప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లను గట్టిగా చేస్తోంది. ఈ రోజు వరల్డ్ కప్ కు సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ ను ఐసీసీ రిలీజ్ చేయడం విశేషం. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన గుజరాత్ లోని అహమ్మదాబాద్ స్టేడియం లో జరగనుంది. కాగా ఇండియా తన మొదటి మ్యాచ్ ను ఆస్ట్రేలియా జట్టుతో అక్టోబర్ 8వ తేదీ చెన్నైలోని చిదంబరం స్టేడియం లో ఆడనుంది. ఇక మన దాయాధి దేశం అయిన పాకిస్తాన్ తో అక్టోబర్ 15వ తేదీ అహమ్మదాబాద్ లో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియా మరియు పాకిస్తాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాగా ఇటీవల జరిగిన వరల్డ్ కప్ ఖ్వాలిఫైయర్స్ లో శ్రీలంక మరియు నెదర్లాండ్ లు ఫైనల్ చేరుకొని వరల్డ్ కప్ కు అర్హత సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news