వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023 : స్కాట్లాండ్ పై శ్రీలంక పేలవ ప్రదర్శన… 245 ఆల్ అవుట్

-

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా ఈ రోజుతో లీగ్ మ్యాచ్ లు పూర్తి కానున్నాయి. అందులో భాగంగా శ్రీలంక మరియు స్కాట్లాండ్ లు తలపడుతున్నాయి. ఇప్పటికే సూపర్ సిక్స్ దశకు చేరుకున్న ఈ రెండు జట్లు ఆఖరి మ్యాచ్ ను గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడానికి ఆడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ఆరంభంలో బాగానే ఆడినా పోను పోను వరుసగా వికెట్లు కోల్పోయి స్కాట్లాండ్ ముందు సాధ్యమయ్యే లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక 245 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. శ్రీలంక ఆటగాళ్లలో ఓపెనర్ నిస్సంక 75 అర్ద సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత అసలంక ఒక్కడే 63 పరుగులు చేసి జట్టుకు కనీసం ఆ స్కోర్ అయినా రావడంలో సహాయపడ్డాడు. స్కాట్లాండ్ బౌలర్లలో గ్రీవ్స్ 4 మరియు వ్వాట్ 3 వికెట్లు దక్కించుకున్నారు.

 

ఈ స్కోర్ ను స్కాట్లాండ్ ఛేదిస్తుందా తెలియాలంటే మరికాసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version