ఈ రోజు నెల్లూరు లోని టీడీపీ నేత బీద రవిచంద్ర నివాసం దగ్గర మాజీ మంత్రి మరియు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగడం లేదని అధికారపార్టీపై ఎప్పటిలాగే విమర్శలు చేశాడు. ఇక నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపైన విమర్శలు విసిరాడు. కాకాణి మంత్రి అయ్యాక నెల్లూరు లో మూడు వైసీపీ వికెట్లు నేలకూలాయని చమత్కారంగా కామెంట్ చేశాడు. నెల్లూరు జిల్లాకు వైసీపీ తరపున కాకాణి గోవర్ధన్ రెడ్డి ఐరన్ లెగ్ అన్నారు. ఇక జగన్ ను ఉద్దేశించి కూడా ఒక కీలక కామెంట్ చేయడం విశేషం. రాష్ట్రంలో జగన్ పరిపాలన చాలా దుర్మార్గంగా మారిందని అన్నారు సోమిరెడ్డి.
కాకాణి మంత్రి అయ్యాక… నెల్లూరు లో మూడు వికెట్లు పడ్డాయి !
-