పంత్ లేని కారణం గానే ఢిల్లీకి వరుస ఓటములు … !

-

ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి అప్రతిష్ట మూటగట్టుకుంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవని ఏకైక జట్టుగా ఢిల్లీ అట్టడుగున ఉంది. ప్రస్తుతం ఢిల్లీకి డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉన్నాడు.. కాగా గతంలో రెండు సీజన్ ల నుండి ఢిల్లీ కి కెప్టెన్ గా రిషభ్ పంత్ జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. గత సీజన్ లో ఢిల్లీ ని ప్లే ఆప్స్ కు చేర్చాడు.

కానీ ప్లే ఆఫ్స్ లో అనూహ్యంగా ఫైనల్ కు అర్హత కావడంలో విఫలం అయింది. అయితే అనుకోకుండా పంత్ కు ఈ మధ్యనే కార్ ఏక్సిడెంట్ జరగడం వలన ఐపిఎల్ కు దూరమయ్యాడు. దానితో టోటల్ టీం ను గాడిన పెట్టే నాధుడే కరువయ్యాడు. ఇక ఆట పరంగా వార్నర్ పర్వాలేదనిపిస్తున్నా … కెప్టెన్ గా ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉంది. అదే ఈ సీజన్ లో పంత్ ఆడి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. మరి చూద్దాం సీజన్ లో ఇంకా మిగిలిన 10 మ్యాచ్ లలో గెలిచి ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version