IPL2025: హార్దిక్ పాండ్యా, గిల్ మధ్య గొడవ!

-

ఐపీఎల్ మ్యాచ్లు తుది దశకు చేరుకున్నాయి. నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగగా ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. జిటి ఓటమిపాలైంది. కాగా ఈ మ్యాచ్ ప్రారంభ సమయంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా గిల్, హార్దిక్ హ్యాండ్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.

Did Shubman Gill snub Hardik Pandya's handshake during GT vs MI IPL Eliminator
Did Shubman Gill snub Hardik Pandya’s handshake during GT vs MI IPL Eliminator

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నించి విరమించుకున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఏవో గొడవలు ఉన్నట్లుగా చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా…. గతంలో గిల్, హార్దిక్ పాండ్యా ఇద్దరు గుజరాత్ టైటాన్స్ జట్టులోనే ఐపిఎల్ మ్యాచ్లు ఆడారు. ఆ సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news