ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ మీద తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగుల ఆధిక్యం సంపాదించింది భారత్. ఆతిథ్య జట్టుకు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ 118తో చెలరేగితే.. ఆల్ రౌండర్లు ఆకాశ్ దీప్ 66, రవీంద్ర జడేజా 53, వాషింగ్టన్ సుందర్ 53 అర్థ సెంచరీలతో అదురగొట్టారు.
ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ స్టన్ 5 వికెట్లు తీయగా.. గన్ అట్కిన్సన్ 3, జెమీ ఓవర్టన్ 2 వికెట్లను పడగొట్టారు. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు ఆకట్టుకున్నారనే చెప్పాలి. 87 ఓవర్లు ఆడి ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ 396 పరుగులు చేశారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచినా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 118 పరుగులు చేసి శబాష్ అనిపించుకున్నాడు.