England team : ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండు జట్టు ఇండియాకు చేరుకుంది. ఈనెల 25 నుంచి తొలి టెస్టు జరగనున్న హైదరాబాద్ కు జట్టు సభ్యులంతా వచ్చారు. వారికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది.

కాగా, ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో రెండో టెస్టు, 15వ తేదీ నుంచి రాజు కోర్టులో మూడో టెస్టు, 23 నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7 నుంచి ధర్మశాలలో ఐదో టెస్టు జరగనుంది.
కాగా, భారత్ తో జరగనున్న 5 టెస్టుల సిరీస్ కు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీబ్రూక్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు. అతని స్థానంలో డాన్ లారెన్స్ ను ఎంపిక చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. బ్రూక్ జట్టులో లేకపోవడం ఇంగ్లాండుకు ఎదురుదెబ్బే. అతను ఇప్పటివరకు 12 టెస్టుల్లో 62.16 యావరేజ్, 91.76 స్ట్రైక్ రేటుతో 1,181 పరుగులు బాదారు. ఇందులో నాలుగు సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.