ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్..!

-

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ డిప్యూటీ తహసీల్దార్ ని అదుపులోకి తీసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా చర్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చర్ల మండల రెవెన్యూ కార్యలయంలో బీరవెల్లి భరణి బాబు అనే వ్యక్తి డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్తపల్లి అనుబంధ గ్రామమైన దండుపేటకు చెందిన కర్త రాంబాబు, తన భూమి పట్టా చేయించాడు, అందుకు సంబంధించి పాసు పుస్తకం కోసం డిప్యూటీ తహసీల్దార్ భరణి బాబును ఆశ్రయించాడు.

అయితే, పాసు పుస్తకం కావాలంటే తనకు రూ.50 వేలు లంచంగా ఇవ్వాలంటూ భరణి బాబు  డిమాండ్ చేశాడు. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ రైతు రాంబాబు.. భరణి బాబుకు రూ.20 వేలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ అదుపులోకి తీసుకున్నారు.  గతంలో బూర్గంపాడు లో డీటీ గా పనిచేస్తున్న సమయంలో ట్రాక్టర్ యజమానుల నుండి లంచం ఆశించి పట్టుబడ్డారు. ఈయన పట్టుబడటం ఇది రెండోసారి.

Read more RELATED
Recommended to you

Latest news