ఇదేమి చోద్యం: రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకున్న మనోజ్ తివారీ … !

-

కేవలం అయిదు రోజుల క్రితమే బెంగాల్ కు చెందిన ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్ని ఫార్మాట్ ల నుండి తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు తాజాగా మళ్ళీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను క్రీడాలోకాన్ని ఆశ్చర్యపరిచాడు. అయితే ఎందుకు ఇంత త్వరగా తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చిందో కూడా మనోజ్ తివారీ చెప్పడం విశేషం. మనోజ్ తివారీ మాట్లాడుతూ … నేను రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఏదో ఎమోషనల్ గా ఉన్న సందర్భంలో తీసుకున్నానని.. కానీ ఆ తర్వాత బాగా అలోచించి ఇంకా బెంగాల్ క్రికెట్ కు చేయాల్సింది మిగిలి ఉందని గ్రహించి నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు.

పైగా ఇంకో సంవత్సరం మాత్రమే బెంగాల్ కు రంజీ క్రికెట్ ఆడుతానని, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సేబాషిస్ గంగూలీ సమక్షములో ఈ నిర్ణయాన్ని మనోజ్ తివారీ వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news