ముంబై హోం గ్రౌండ్ అయినటువంటి వాంఖడే స్టేడియంలో కేకేఆర్ తేలిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి కేకేఆర్ బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. ముంబై ఆరంగేట్ర బౌలర్ అశ్వనీకుమార్ 4 వికెట్లతో సత్తా చాటారు. దీపక్ చాహర్ 2, బౌల్ట్, హార్దిక్, విఘ్నేష్, శాంట్నర్ తలో వికెట్ తీశారు. దీంతో ముంబై ఇండియన్స్ టార్గెట్ 117 పరుగులు చేయాలి.
ఇక కేకేఆర్ బ్యాటర్ల స్కోర్లను పరిశీలించినట్టయితే ఓపెనర్ డికాక్ 01, సునీల్ నరైన్ 0, రహానె 11, రఘువన్షీ26 టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ 3, రింకు సింగ్ 17, మనీష్ పాండే 19, రస్సెస్ 5, రమణ్ దీప్ సింగ్ 22, హర్షిత్ రానా 4, జాన్సన్ 1 పరుగు సాధించి నాటౌట్ గా నిలిచాడు. అశ్వనీ కుమార్ కీలక బ్యాట్స్ మెన్ లను పెవీలియన్ కి చేర్చాడు.