ఐపీఎల్ లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో పోరెల్ 18, కరుణ్ నాయర్ 31, కే.ఎల్. రాహుల్ 28, కెప్టెన్ అక్షర్ పటేల్ 39, స్టబ్స్ 31, అశుతోష్ శర్మ 37 పరుగులు చేశారు. టాప్ స్కోరర్ గా అక్షర్ పటేల్ నిలవడం విశేషం.
ఫెరీరా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీశాడు. సిరాజ్ 1, అర్షద్ ఖాన్ 1, ఇషాంత్ శర్మ 1 వికెట్ తీశారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 204 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానంలో ఉన్న ఈ టీమ్ లలో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి.