IPL 2024: నేడు చెన్నైతో మ్యాచ్‌…ఓడితే గుజరాత్‌ ఇంటికే !

-

Gujarat Titans vs Chennai Super Kings, 59th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 59వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Gujarat Titans vs Chennai Super Kings, 59th Match

ఇందులో టాస్ నెగ్గిన జట్టు… మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే కచ్చితంగా ఇంటికి వెళ్తుంది. అదే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోతే… ప్లే ఆఫ్ ఆశలు మరింత కఠినమవుతాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెంట్స్… ప్లే ఆఫ్ కోసం కసిగా పోరాటం చేస్తున్నాయి. ఒకవేళ ఇందులో చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news