ఒలింపిక్స్ : వినేష్ ఫోగట్ కి 4 కోట్ల నజరానా..!

-

ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి గోల్డ్ మెడల్ తెస్తుంది అని అందరూ ఆశలు పెట్టుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై ముగించని రీతిలో అనూహ్యంగా వేటు పడిన విషయం తెలిసిందే. 100 గ్రాముల బరువు అధికంగా ఉంది అని ఆమె పై నిర్వాహకులు వేటు వేశారు. దీంతో ఒక్కసారి షాక్ కు గురైన భారతీయులు వినేష్ ఫోగట్ కి బాధతుగా నిలిచారు. ఇక ఇదే క్రమంలో వినేష్ ఫోగట్ కు వినేష్ ఫోగట్ కి హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

4 కోట్ల రూపాయల నజరానా ఇచ్చిన హర్యానా ప్రభుత్వం.. వినేష్ ను ఛాంపియన్ గా పరిగణిస్తూ.. నజరానా ఇస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. తమ రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ లో గోల్డ్ గెలిస్తే 6 కోట్లు, సిల్వర్ గెలిస్తే 4 కోట్లు, కాంస్యం గెలిస్తే 2.5 కోట్లు ఇస్తామని ముందుగానే ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. దీంతో ఫైనల్స్ కు చేరిన వినేష్ ను సిల్వర్ మెడల్ విన్నర్ గా భావిస్తూ… 4 కోట్లు నజరానా ఇస్తున్నామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version