Klaasen: ఇదేం…ఊర మాస్ బ్యాటింగ్ మామ..అంటూ ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ క్లాసెన్ పై సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. నిన్న జరిగిన మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ క్లాసెన్ 29 బంతుల్లో ఏకంగా 63 పరుగులు చేశాడు.
దీంతో హైదరాబాద్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరల్లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ క్లాసెన్ ఔట్ అయ్యాడు. ఇక జట్టు కోసం పోరాడినందుకు గానూ.. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ క్లాసెన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా, మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్య సాధనలో హైదరాబాద్ జట్టు కూడా చాలా స్ట్రాంగానే ఆడింది. చివర్లో క్లాసన్ భయంకరమైన బ్యాటింగ్ చేశాడు. అయినప్పటికీ నిర్ణయిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే హైదరాబాద్ చేయడంతో ఓటమిపాలైంది. ఈ తరుణంలో కోల్కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.