ప్రస్తుతం శ్రీలంక జట్టును సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేడు. అందుకనే గత కొంత కాలంగా లంక జట్టు వైఫల్యాలను ఎదుర్కొంటోంది. అయితే ఆ జట్టు మాత్రం ఆల్‌రౌండర్ మాథ్యూస్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
క్రికెట్ జట్టు ఏదైనా సరే.. అందులో ఆల్‌రౌండర్లు ఉంటే జట్టుకు వారు అదనపు బలం అనే చెప్పవచ్చు. కావల్సిన సమయంలో టీం కోసం వికెట్లు తీయవచ్చు. అలాగే పరుగులు చేయవచ్చు. అందుకే ఆల్‌రౌండర్లు ఒక్కోసారి మ్యాచ్‌లను శాసిస్తుంటారు. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 కోసం అన్ని దేశాల జట్లు తమ తమ టీంలలో మంచి ఆల్‌రౌండర్ ప్రదర్శన ఇచ్చే ప్లేయర్లను ఇప్పటికే ఎంపిక చేసుకున్నాయి. మరి ఆ ఆల్‌రౌండర్లు ఎవరు, ఎవరికి ఎంత సత్తా ఉంది, వారు జట్టులో ఉంటే మ్యాచ్‌లు గెలవగలుగుతారా, లేదా.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రూ రస్సెల్
ఈసారి ఐపీఎల్ సీజన్‌లో ఆండ్రూ రస్సెల్ ఎలా విజృంభించాడో అందరికీ తెలిసిందే. ఓ దశలో కోల్‌కతా టీం ఫైనల్ కు చేరుకుని ఐపీఎల్ ట్రోఫీ సాధిస్తుందనే అందరు అనుకున్నారు. కానీ ఎంత రస్సెల్ అయినా అన్ని మ్యాచ్‌లలోనూ విజృంభించి ఆడడం కష్టమే. అయినప్పటికీ రస్సెల్ టీంలో ఉంటే ఎంతటి ఉత్కంఠ మ్యాచ్‌ను అయినా తన వైపుకు తిప్పుకునే సత్తా అతనిలో ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రస్సెల్ వెస్టిండీస్ టీం సభ్యుడిగా వరల్డ్ కప్ ఆడుతున్నాడు. మరి ఈ సారి ఐపీఎల్‌లో బ్యాట్ ఝులిపించినట్లుగానే వరల్డ్ కప్‌లోనూ రస్సెల్ విజృంభిస్తాడా, లేదా అన్నది.. మరికొద్ది రోజులు ఆగి చూస్తే తెలుస్తుంది.
హార్దిక్ పాండ్యా…
భారత క్రికెట్ జట్టుకు కపిల్ దేవ్ తరువాత దొరికిన మేటి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అని మాజీ క్రికెట్ ప్లేయర్లు పాండ్యాకు ఎప్పుడో కితాబిచ్చారు. అందుకు అనుగుణంగానే పాండ్యా చాన్స్ దొరికినప్పుడల్లా తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడితను వరల్డ్ కప్‌లో ఆడుతున్నాడు. మరి వరల్డ్ కప్ లో పాండ్యా అటు బ్యాట్‌తోపాటు ఇటు బంతితోనూ రాణించి, భారత్‌కు కప్ తెస్తాడా.. అనేది తెలియాలంటే.. కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే.
బెన్ స్టోక్స్…
ఈసారి ప్రపంచ కప్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న జట్లలో ఇంగ్లండ్ కూడా ఒకటి. ఈ జట్టుకు బెన్ స్టోక్స్ లాంటి ఆల్‌రౌండర్ దొరకడం వారి అదృష్టమనే చెప్పాలి. బౌలింగ్, బ్యాటింగ్ రెండు అంశాల్లోనూ స్టోక్స్ రాణించగలడు. గత కొంత కాలంగా ఇంగ్లండ్ సాధిస్తున్న అనేక విజయాల్లో స్టోక్స్ పాత్ర కూడా ఉంది. ఇక ఈ సారి స్టోక్స్ వరల్డ్ కప్‌లో రాణిస్తే.. ఇంగ్లండ్‌కు కప్ రావడం పెద్ద సమస్యేమీ కాదనే చెప్పాలి.
ఏంజెలో మాథ్యూస్…
ప్రస్తుతం శ్రీలంక జట్టును సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేడు. అందుకనే గత కొంత కాలంగా లంక జట్టు వైఫల్యాలను ఎదుర్కొంటోంది. అయితే ఆ జట్టు మాత్రం ఆల్‌రౌండర్ మాథ్యూస్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో మాథ్యూస్ రాణిస్తే వరల్డ్ కప్‌లో శ్రీలంక సునాయాసంగా విజయాలు సాధిస్తుందనే చెప్పవచ్చు.
ఇక పైన చెప్పిన వారే కాకుండా కివీస్ జట్టుకు జిమ్మీ నీషమ్, సౌతాఫ్రికాకు క్రిస్ మోరిస్, ఆస్ట్రేలియాకు స్టాయినిస్, బంగ్లాదేశ్‌కు షకిబ్, ఆఫ్గనిస్థాన్‌కు నబి లాంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. మరి వీరిలో ఈ సారి వరల్డ్ కప్‌లో సత్తా చాటేది ఎవరో.. మరికొద్ది రోజుల్లో తేలనుంది.