Asia Cup 2023 : ఆసియాకప్ మ్యాచ్ల కోసం తీవ్రంగా శ్రమించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్ మేన్ కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ భారీగా ప్రైజ్ మనీ ప్రకటించింది. కొలంబో, క్యాండీ మైదానాల్లో పనిచేసిన వారికి శ్రీలంక క్రికెట్ బోర్డుతో కలిసి రూ. 42 లక్షలు(USD 50,000) ఇవ్వనున్నట్లు ACC ప్రెసిడెంట్ జైశా ప్రకటించారు. మ్యాచులకు తరచుగా వరుణుడు అంతరాయం కలిగించగా గ్రౌండ్స్ ను సిద్ధం చేసేందుకు క్యూరేటర్లు, గ్రౌండ్స్ మెన్ చాలా కష్టపడ్డారు.
కాగా, ఆసియాకప్-2023 ఫైనల్ లో భారత బౌలర్లు చెలరేగడంతో లంక జట్టు 15.2 ఓవర్లలో 50 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వన్డేల్లో అత్యల్ప స్కోరుకు 6 వికెట్లు కోల్పోయిన జట్టుగా తన పేరిట ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసింది.2012లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో లంక 13 రన్స్ కు 6వ వికెట్ కోల్పోగా…. ఇవాళ ఆసియాకప్ లో భారత్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 12 పరుగులకే ఆరో వికెట్ కోల్పోయింది. అయితే… ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టును 50 పరుగులకే పరిమితం చేయడంతో మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టి కీలకపాత్ర పోషించాడు.