IND vs WI : మూడో టీ20లోనూ భారత్ విజ‌యం.. 3-0తో సిరీస్​ క్లీన్​స్వీప్

-

కోల్‌క‌త్తాలో వెస్టిండిస్‌తో జ‌రిగిన మూడ‌వ టీ-20 మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌య‌మే సాధించింది. 17 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి సిరీస్‌ను 3-0 తేడాతో కైవ‌సం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 20 ఓవ‌ర్ల‌కు 5 వికెట్లు కోల్పోయి 184 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ 31 బంతుల్లో 65 ప‌రుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు, ఒక ఫోర్ ఉంది. అదేవిధంగా వెంకటేశ్ అయ్యర్(35) ధనాధన్ ఇన్నింగ్స్​తో అలరించాడు. ఇషాన్ కిషన్ 34 పరుగులు చేసాడు. విండీస్​ బౌలర్లలో హోల్డర్, షెపార్డ్, ఛేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో ఒక్కో వికెట్​ తీశారు.

అనంతరం ఛేదనను ప్రారంభించిన కరీబియన్​ జట్టు ధాటిగానే బ్యాటింగ్ చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల నిర్ణీత ఓవర్లలో 167/9 పరుగులే చేయగలిగింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో నికోల‌స్ పూరన్(61) మ‌రొక‌సారి హాప్ సెంచ‌రీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో పొవెల్ 25, మేయర్స్ 6, హోప్ 8, పొలార్డ్ 5, హోల్డర్ 2, ఛేజ్ 12, షెపార్డ్ 29 పరుగులు చేసారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్ అంద‌రూ రెండేసి వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version