తొలి టెస్ట్‌లో రోహిత్ సేన ఓటమి..బిగ్‌ షాక్‌ ఇచ్చిన ఐసీసీ !

-

భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాభవం మూటగట్టుకుంది.5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడిన ఇండియా జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఉప్పల్‌లో ముగిసిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

India slide to fifth on WTC table after defeat to England in Hyderabad

అయితే..తొలిటెస్ట్ లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైన టీం ఇండియా…. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ ఆరంభంలో పట్టు కనబరిచిన రోహిత్ సేన….ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్ ను డ్రా చేసుకున్న డబ్ల్యూటీసి పట్టికలో టాప్ ప్లేస్ చేజిక్కించుకోగా….తాజా ఫలితంతో బంగ్లా తర్వాతి స్థానానికి చేరింది. 55 పాయింట్లతో ఆస్ట్రేలియా టేబుల్ టాపర్ గా కొనసాగుతుండగా….ఆ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా (50), కివిస్ (50), బంగ్లా (50) భారత్ (43.33) ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version