Asia Cup 2024 Final: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది యువ భారత్. అండర్-19 ఆసియా కప్ 2024లో భాగంగానే..టీమిండియా వర్సెస్ బంగ్లా దేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్ కు దుబాయ్ వేదిక అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది యువ భారత్.. గతేడాది సెమీస్లో బంగ్లా చేతిలోనే ఓడింది టీమిండియా. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు భారత కుర్రాళ్లు.
జట్లు:
బంగ్లాదేశ్ U19 (ప్లేయింగ్ XI): జవాద్ అబ్రార్, కలాం సిద్ధికి అలీన్, ఎండి అజీజుల్ హకీమ్ తమీమ్ (సి), మహ్మద్ షిహాబ్ జేమ్స్, ఎండి ఫరీద్ హసన్ ఫైసల్ (w), దేబాసిష్ సర్కార్ దేబా, ఎండి సమియున్ బసిర్ రతుల్, మరుఫ్ మృధా, ఎండి రిజాన్ హోస్సన్ అల్ ఫహద్, ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్దార్థ్ సి, మహ్మద్ అమన్ (సి), కెపి కార్తికేయ, నిఖిల్ కుమార్, హర్వాన్ష్ సింగ్ (w), కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహ