Rohith Sharma : డకౌట్.. అయినా ధోని రికార్డు సమం చేసిన రోహిత్?

-

Rohith Sharma : డకౌట్.. అయినా ధోని రికార్డు సమం చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ పై జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  ఈ మ్యాచ్ లో గెలిచి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై చెలరేగిపోయారు.

India vs Afghanistan Rohit Sharma equals MS Dhoni’s record in T20Is

ఈ తరుణంలోనే రోహిత్‌ శర్మ అరుదైన ఫీట్‌ అందుకున్నాడు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా ధోని(41) సరసన నిలిచారు. ధోని 72 మ్యాచుల్లో, రోహిత్ 53 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించారు అలాగే అత్యధిక టీ20 సిరీస్ లు(12) గెలిచిన భారత కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news