టీమిండియా మరో పోరుకు రెడీ అయింది. ఇవాల్టి నుంచి టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లేదు కదా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే మొదట నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఇవాళ బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.
నిన్నటి నుంచి బెంగళూరు సిటీలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయ్యామయ్యాయి. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా బెంగళూరులో వర్షాలు పడ్డట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే ఇవాళ ఉదయం కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో… మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారుతుందా… అనే టెన్షన్ అందరిలో ను ఉంది.ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ పై టీమిండియా కు అఖండమైన రికార్డు ఉంది. గత 24 ఏళ్లుగా భారత్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవలేదు న్యూజిలాండ్. దీంతో టీమిండియా ఈసారి విజయం సాధిస్తుందని అందరూ అంటున్నారు.