సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్ లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పర్యటనలో క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి.. పదవి చేపట్టిన తర్వాత.. దాదాపు 20కి పైగా ఢిల్లీకి వెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 11 నెలల కావోస్తోంది.. అప్పటి నుంచి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని.. సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు.. ఈ క్రమంలో శ్రావణమాసం లోపు మంత్రివర్గంలోకి కొత్త మంత్రులు చేరుతారని అందరూ అనుకున్నారు.. కానీ అది జరగలేదు.. దసరా కల్లా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగవచ్చనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పటికే హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలు పూర్తవడంతో తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.