టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఏకంగా 188 పరుగుల తేడాతో టీమిండియా విజయ డంకాను మోగించింది. రెండో ఇన్నింగ్స్ లో 513 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ను ఆరంభించిన బంగ్లాదేశ్ జట్టు 324 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
బంగ్లా బ్యాటర్లలో జాకీర్ హాసన్ 100 పరుగులు మరియు శాకీబుల్ హసన్ 84 పరుగులు అటు శాంటో 67 పరుగులతో రాణించారు. ఇక భారత బౌలాలలో అక్షర పటేల్ నాలుగు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. సిరాజ్, ఉమేష్ యాదవ్ అలాగే అశ్విన్ తల వికెట్ పడగొట్టారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 404 పరుగులు కాగా రెండో ఇన్నింగ్స్ లో 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కాగా ఈ రెండు జట్ల మధ్య ఈనెల 22వ తేదీ నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.