ఐపీఎల్ లో హైద్రాబాద్ మరియు లక్నో జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన మార్ క్రామ్ సేన నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసి, లక్నో ముందు 183 పరుగుల టార్గెట్ ను ఉంచింది. ఈ స్కోర్ చేధించే క్రమంలో ఆల్మోస్ట్ లక్నో విజయం సాధించే దిశగా కొనసాగుతోంది. ఇన్నింగ్స్ మొత్తం మీద హైద్రాబాద్ ఫేవరేట్ గా కనిపించినా కేవలం ఒకే ఒక్క ఓవర్ లో మొత్తం సీన్ మారిపోయింది. స్పిన్నర్ అభిషేక్ శర్మ వేసిన 16 వ ఓవర్లో మ్యాచ్ ఆసాంతం లక్నో చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఓవర్ లో మొదటి రెండు బంతులను ను స్ట్రైకింగ్ తీసుకున్న స్థాయినిస్ భారీ సిక్సర్లుగా మలిచాడు.
మూడవ బంతికి మరో భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ఆఖరి మూడు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి ఆ ఓవర్ లో మొత్తం ఒక వైడ్ తో సహా 31 పరుగులు సాధించారు. దీనితో మ్యాచ్ లో లక్నో ఫేవర్ గా మారిపోయింది.