డయాబెటిస్ వారిలో 9 ప్రమాదకరమైన సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త..!

-

డయాబెటిస్: ఈ రోజుల్లో డయాబెటిస్ తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా డయాబెటిస్ తో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. డయాబెటిస్ వలన రకరకాల సమస్యలు వస్తాయి డయాబెటిస్ ఉన్నవాళ్లు జాగ్రత్త పడకపోతే ప్రమాదకరమైన సమస్యలు సంభవిస్తాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం జీవన విధానాన్ని అనుసరించడం చాలా అవసరం. లేకపోతే ఈ ప్రాణాంతకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు జాగ్రత్త వహించకపోతే కార్డియా వాస్కులర్ సమస్యలు వస్తాయి.

హార్ట్ ఎటాక్ స్ట్రోక్ మొదలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. దీంతో బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతే నరాల ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తిమ్మిరి ఎక్కడం, చేతులు కళ్ళల్లో ఇబ్బందులు వంటిది వస్తూ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండకపోతే కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువైతే కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి.

పాదాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు జాగ్రత్త పడకపోతే పాదాల్లో ఇన్ఫెక్షన్స్ అల్సర్స్ వంటివి కలుగుతూ ఉంటాయి. చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చర్మం పొడిగా మారిపోవడం ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటివి కలుగుతాయి. కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా జాగ్రత్త వహించాలి. రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది.

షుగర్ ఉన్నవాళ్లు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా కలుగుతాయి. ఓరల్ హెల్త్ కూడా పాడవుతుంది. మానసిక సమస్యలను కూడా ఎదుర్కోవాలి కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన సమస్యలు ఏమీ లేకుండా జాగ్రత్తగా మంచి ఆహారం తీసుకోవడం సరైన జీవన విధానాన్ని అనుసరించడం వ్యాయామం మంచి నిద్ర ఇవన్నీ కూడా సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. మంచినీళ్ళని కూడా తీసుకుంటూ ఉండాలి. తినకూడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇలా పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news