ఐపీఎల్ 2023: రేర్ రికార్డ్ ధోని @ 250 ఐపీఎల్ మ్యాచ్ లు…

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎన్నో విజయాలను టైటిల్ లను దేశానికి అందించాడు. ఆ తర్వాత దేశవాళీ లీగ్ అయినా ఐపీఎల్ లోనూ తన టీం కు టైటిల్ అందించి సక్సెస్ ఫుల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 2023 లో ఈ రోజు అహమ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా కెప్టెన్ ధోని మరో ఆరుదిన ఘనతను అందుకోనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ప్లేయర్ కు కూడా సాధ్యం కాని విధంగా ఈ మ్యాచ్ తో 250 మ్యాచ్ లను ఆడిన ప్లేయర్ గా రికార్డు పుటలలోకెక్కనున్నాడు. తాను మైదానంలో దిగితే ప్రేక్షకులు ఏ విధంగా తనను అభిమానిస్తారో తెలిసిందే. ఇక ఈ రోజు మ్యాచ్ లో ధోని ప్రేక్షకులకు చెన్నై కు మరో టైటిల్ ను అందించి ఘనంగా ఈ రికార్డును తీసుకుంటాడా చూడాలి.

అంతే కాకుండా ధోనికి ఈ మ్యాచ్ తో ఐపీఎల్ చివరిది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త అబద్దం అని స్వయంగా ధోని ద్వారా వినాలని ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version