ధరణి పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది – గద్దర్

-

తెలంగాణ రాష్ట్రంలో ధరణి పేరుతో పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించారు ప్రజా యుద్ధనౌక గద్దర్. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద అలైన్మెంట్ మార్చాలని త్రిపుల్ ఆర్ బాధ్యత రైతులు కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రెండు రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిరోజు దీక్షలో పాల్గొన్నారు గద్దర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం కాలం నుండే తెలంగాణలో భూ సమస్యలు ఉన్నాయన్నారు.

పంట పెట్టుబడి సాయం పేరుతో బంజరు భూములుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. పశ్చిమబెంగాల్ లో కూడా భూ పోరాటాలు జరిగాయని.. ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసమే జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణలో గత పదిహేళ్లుగా రైతులు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్న గద్దర్.. భువనగిరి సభ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందన్నారు. పార్లమెంటులో రైతు చట్టాలు చేస్తే పంజాబ్ రైతులు పోరాడి రద్దు చేశారని.. తెలంగాణలో కూడా అదే విధంగా భూ సేకరణ విధానాన్ని రద్దు చేద్దామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version