ఐపీఎల్ 2023: నాలుగవ విజయం కోసం కోల్కతా – హైదరాబాద్ జట్లు పోటీ !

-

ఈ రోజు హైద్రాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం లో ఈ రోజు సన్ రైజర్స్ హైద్రాబాద్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్యన కీలక మ్యాచ్ కోసం సర్వం సిద్ధంగా ఉంది. ముందుగా టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ నితీష్ రాణా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు రెండు జట్లు మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి ఉన్నారు. అయితే కోల్కతా మొత్తం 9 మ్యాచ్ లు ఆడగా, సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం 8 మ్యాచ్ లు మాత్రమే ఆడింది. ఈ మ్యాచ్ లో కనుక హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా బౌలర్లను ఎదుర్కొని గెలువడం అంటే ఆషామాషీ విషయం కాదు.

కానీ ప్రస్తుతం హైదరాబాద్ కు ఉన్న ప్లేయర్స్ అంచనాలకు తగినట్లు ఆడితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా నాలుగవ మ్యాచ్ విజయం కోసం పోటీలో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version