హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో తెలుగు సినీ వర్కర్స్ కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని హాజరైయ్యారు. దాసరి నారాయణరావు ఎల్లప్పుడూ కార్మికుల కోసం కృషి చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దాసరి మరణించిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయిందని మంత్రి అన్నారు. దాసరితో తనకు మంచి అనుబంధం ఉండేదన్నారు ఆయన. చిత్రపురి కాలనీ కోసం దాసరి ఎంతో కృషి చేశారని మంత్రి తలసాని దాసరి గారిని పొగిడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చిత్రపురి కాలనీ వాసులకు కూడా అందజేసేట్లు కృషి చేస్తామన్నారు ఆయన. దాసరి వంటి గొప్ప వ్యక్తి మళ్లీ పుట్టరని వెల్లడించారు.
సినీ కార్మికుల గురించి దాసరి గారు తన జీవితాన్నే త్యాగం చేశారని అన్నారు. దాసరి ఉన్నప్పుడు ఆయన ఇల్లు ధర్మసత్రం తరహాలో ఉండేదన్నారు. దాసరిని కోల్పోయిన తర్వాత కార్మికులకు ఆయన లేని లోటు తెలిసి వస్తుందని అన్నారు మంత్రి. ఈ సమావేశం లో దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.