IPL 2023 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్..ఇక జట్లకు పండగే !

-

2023 ఐపీఎల్ సీజన్ కు జరిగే వేలంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఈనెల 23న కోచి వేదికగా ఈ మినీ యాక్షన్ జరుగుతుందని ప్రకటించింది. ఈ టోర్నీకి ఈసారి 991 మంది రిజిస్టర్ అయ్యారని, వీరిలో 714 మంది భారతీయులు కాగా 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారని బోర్డు పేర్కొంది.

అయితే, ఐపీఎల్‌ 2023 నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐపీఎల్‌ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జట్లకు బిగ్‌ రిలీఫ్‌ కలుగనుంది. మరి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలేంటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ : సింపుల్ గా చెప్పాలంటే సబ్ స్టిట్యూట్ ప్లేయర్ నే ఇంపాక్ట్ ప్లేయర్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఫుట్ బాల్, రగ్బీ ఆటలను చూసేవారికి ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతానికి టాస్ వేశాక ప్రకటించిన తుది జట్టు ప్లేయర్లకు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలు ఉంది. మధ్యలో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో సబ్స్టిట్యూట్ గా వచ్చే ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ వరకే పరిమితం అవుతాడు.

Read more RELATED
Recommended to you

Latest news