ఐపీఎల్ లో ఇంట్రస్టింగ్ ఫైట్..ఎవరు గెలిస్తే వారిదే టాప్‌ ప్లేస్…!

-

ఒకవైపు నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో జోరు మీదున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ఇంకోవైపు అన్నే మ్యాచ్‌లు ఆడి మూడింట్లో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్‌. ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర సమరానికి వేళైంది. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో రెండు బలమైన జట్లు అమీతుమీకి సిద్దమయ్యాయి. దుబాయ్ వేదికగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడిన ఇరు జట్ల తలా మూడు విజయాలతో టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాయి.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లి సారథ్యంలోని బెంగళూరు ఆత్మవిశ్వాసం పెంచుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో టచ్‌లో వచ్చాడు. ఇది ఆర్‌సీబీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఇక యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించి దూకుడు మీదున్నాడు. ఫించ్, డివిలియర్స్ సత్తా చూపెడుతుండగా.. మిడిలార్డర్‌లో మాత్రం కొన్ని సమస్యలున్నాయి. టాపార్డర్‌లో ఏ ఇద్దరు చెలరేగిన ఆర్‌సీబీకి తిరుగుండదు.బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ టాప్ ఫామ్‌లో ఉండగా.. ఉదానా, షైనీ, జంపా తదితరులతో లైనప్ బలంగా కనిపిస్తోంది. కానీ డెత్ ఓవర్లలోనే బౌలర్లు తేలిపోవడం జట్టు కలవరపెడుతుంది.

మరోవైపు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దూసుకెళ్తున్న ఢిల్లీకి.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, పృథ్వీ షా, రిషబ్‌ పంత్‌, రబాడ కీలకం. లీగ్ మొదలైనప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోనే ఉన్నాడు. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పృథ్వీ షా, రిషభ్ పంత్ ఫామ్‌‌లోనే ఉన్నారు. శిఖర్ ధావన్ మెరుపులు మెరిపిస్తున్నా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. హెట్‌మెయిర్,స్టోయినిస్ మరింత రాణించాల్సి ఉంది. ఇవి తప్ప ఢిల్లీకి బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యల్లేవు. బౌలింగ్‌లో కగిసో రబడా ప్రధాన ఆయుధం కాగా..నోర్జే సత్తా చాటుతుండడం ఢిల్లీకి ప్లస్ అవుతుంది. కేకేఆర్‌పై అదరగొట్టిన హర్షల్ పటేల్‌కు మరో చాన్స్ దొరకవచ్చు.

ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని విరాట్ సేన భావిస్తుండగా.. జైత్రయాత్రను కొనసాగించాలని ఢిల్లీ ఉవ్విళ్లూరుతుంది. మరీ గెలుపు ఏ జట్టును వరిస్తుందో..?

Read more RELATED
Recommended to you

Exit mobile version