పెళ్లైన 8ఏళ్లకు భార్య ఫేస్ రివీల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్

-

టీమ్ ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి తన భార్య సఫా బేగ్​ ఫేస్ ను రివీల్ చేశాడు. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత తన సతీమణిని ఇర్ఫాన్ ప్రపంచానికి పరిచయం చేశాడు.  వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, ఆమెతో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది.

‘నువ్వు చాలా బాధ్యతలు తీసుకున్నావు. నాకు ఓ మిత్రుడిలా, కమెడియన్​గా, నా పిల్లలకు తల్లిగా వ్యవహరిస్తున్నావు. నువ్వు భార్యగా నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తా. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని ఇర్ఫాన్ తన పోస్టు కింద క్యాప్షన్  రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. సఫా బేగ్ చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇర్ఫాన్ భాయ్ బాబీ ఈజ్ సో బ్యూటీఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో ఇర్ఫాన్ తన ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పుడు ఆ ఫొటోల్లో తన భార్య సఫా బుర్ఖా ధరించి కనిపించే వారు. తొలిసారి ఆమె ముఖంపై హిజాబ్ ధరించకుండా కనిపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version