గత సంవత్సరం సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న కివీస్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ను ఆ యాజమాన్యం వేలానికి వదిలేయడంతో గుజరాత్ టైటాన్స్ అతన్ని కొనుక్కుంది. కాగా నిన్న సాయంత్రం మొదటి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ ఇప్పుడు ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న మొదటి ఇన్నింగ్స్ లో చెన్నై బ్యాటింగ్ ఆడుతున్న సందర్భంలో సిక్సర్ ను ఆపబోయి కాలికి గాయం అయింది.
దీనితో నిన్న మళ్ళీ ఫీల్డ్ లోకి కానీ, అలాగే బ్యాటింగ్ కు కానీ రాలేదు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గాయం ఇప్పుడల్లా నయమయ్యే పరిస్థితి కనిపించడం లేదట. దీనితో ఐపీఎల్ కు దూరం అయ్యే ప్రమాదం ఉందని ఒక పత్రిక తెలిపింది. దీనిపైన అధికారిక వార్త వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.