జోస్ బట్లర్‌కు గాయం.. ఫిల్ సాల్ట్‌కు ఇంగ్లండ్ జట్టు పగ్గాలు..!

-

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ నియామకం అయ్యారు. ప్రస్తుత కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా దూరం కావడంతో సాల్ట్‌కు అవకాశం దక్కింది. సాల్ట్ 31 టీ20ల్లో 165.11 స్ట్రైక్ రేటుతో 885 పరుగులు సాధించాడు.ఈనెల 11,13,15 తేదీల్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మ్యాచులు జరగనున్నాయి.అయితే, ఇటీవల ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా కెప్టెన్ జోస్ బట్లర్ గాయం పాలైనట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాతో ఆడబోయే జట్టును ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు ప్రకటించింది. అందులో ఫిల్ సాల్ట్ (కెప్టెన్), ఆర్చర్, జాకబ్,బ్రైడన్, జోర్డాన్, సామ్ కరన్, హల్, జాక్స్, లివింగ్ స్టోన్, సాకిబ్, మౌస్లీ, ఓవర్ టన్, రషీద్, టోప్లీ, జాన్ టర్నర్ తదితరులు ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news