Online payments in Telangana RTC buses: తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు బిగ్ అలెర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకోసం కీలక ప్రకటన చేసింది TGSRTC. బస్సులలో చిల్లర సమస్యలకు చెక్ పెట్టడానికి TGSRTC డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పల్లె వెలుగు సహా బస్సులు అన్నింటిలోనూ ఈ విధానాన్ని అమలు చేయబోతుంది.

దీనికోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. 13,000 కొత్త మిషన్లకు ఆర్డర్లు ఇచ్చారు. అలాగే బస్సు పాసుల స్థానంలో డిజిటల్ కార్డులను ఇవ్వనున్నారు.