భర్త ఆస్తి రూ.36,690 కోట్లు.. కానీ 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని భార్య

-

ఈరోజుల్లో సామాన్యులు కూడా హుందాగా లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఖరీదైన వస్తువులు కొంటున్నారు. ప్రతి ఫంక్షన్‌ను కొత్త కొత్త బట్టలు కొంటున్నారు. కానీ రూ. 775 కోట్ల ఆస్తులు కలిగిన మహిళ సాదాసీదా జీవితాన్ని గడుపుతుందంటే నమ్ముతారా? నిజమే.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి, బహుముఖ విద్యావేత్త, రచయిత్రి మరియు పరోపకారి. 2006లో.. సుధా మూర్తిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. మరియు 2023లో.. భారతదేశపు మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ లభించింది. సుధా మూర్తి నికర విలువ దాదాపు రూ. 755 కోట్లుగా అంచనా. ఆమె సంవత్సరానికి రూ. 300 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. కానీ 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనలేదట..!

గత 30 ఏళ్లలో ఒక్క కొత్త చీర కూడా కొనలేదంటే నమ్మగలరా. అవును. సగటు జీతం తీసుకునే మహిళలకు నెలకు ఒక్క చీర కొంటారు.. ఇన్ని కోట్ల ఆస్తులున్న ఆమె 30 ఏళ్లలో కొత్త చీర కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయాన్ని సుధా మూర్తి స్వయంగా ఒకసారి చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో, “నేను కాశీలో పుణ్యస్నానం కోసం వచ్చాను, సాధారణంగా మీరు కాశీకి వెళ్లినప్పుడు మీకు ఇష్టమైన అలవాటును వదులుకోవాలి. ఇకపై కొత్త చీరలు కొనకూడదని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి కొత్త చీరలు కొనడం మానేశాను. ఇప్పుడు నేను నిత్యావసర వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తున్నాను,” అని చెప్పింది.

సుధా మూర్తి కూడా తన భర్త నారాయణ మూర్తి తనతో ఏకీభవించారని, అతను కూడా సాధారణ అభిరుచి ఉన్న వ్యక్తి అని చెప్పారు. సుధా మూర్తి తన సోదరీమణులు, సన్నిహితులు మరియు ఆమెతో అనుబంధం ఉన్న NGOలు ఆమెకు బహుమతిగా ఇచ్చిన చీరలను ధరిస్తారు. అయితే సుధ మరియు నారాయణ మూర్తి పుస్తకాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ జంట 20,000 కంటే ఎక్కువ పుస్తకాలను సేకరించారు.

సుధా మూర్తి భర్త నారాయణ మూర్తి నికర విలువ 4.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 36,690 కోట్లు)గా ఫోర్బ్స్ అంచనా వేసింది. ఈ దంపతులకు అక్షదా మూర్తి మరియు రోహన్ మూర్తి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుధా మూర్తి కుమార్తె అక్షత UK ప్రధాన మంత్రి రిషి సునక్‌ను వివాహం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news