ఆ పార్టీలో చిలుక జ్యోతిష్యులు ఎక్కువయ్యారు : ఆది శ్రీనివాస్

-

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి చేతకాని మీరు ముఖ్యమంత్రి మార్పు గురించి చెబుతున్నారా..? అని బీజేపీని ఉద్దేశించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీజేపీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఏఐసీసీ ఆఫీస్ గోడకు చెవులు పెట్టి వింటున్నారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ బీజేపీలో చిలుక జ్యోతిష్యులు ఎక్కువయ్యారని ఆది శ్రీనివాస్ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని మారుస్తున్నారంటు నోటికొచ్చినట్లు వాగుతున్నారని, పార్టీ అధ్యక్ష పదవి సంపాదించడం కోసం ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.

తెలంగాణ బీజేపీలోని లుకలుకలు ఎమ్మెల్యే రాజా సింగ్ రోజూ బయటపడుతూనే ఉన్నారని, ముందు వాటి గురించి ఆలోచించుకోండని ఆది శ్రీనివాస్, వ్యాఖ్యానించారు. సంచలనం కోసం ధర్మపురి అర్వింద్ చిలుక జ్యోతిష్యం చెబుతున్నారని, ఆయనలా వసూళ్లు చేయాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. ఈ దేశంలో వసూళ్ల పార్టీ ఏదో ఎన్నికల సంఘం లెక్కలు చెపుతూనే ఉన్నాయన్నారు. 8 వేల మంది కార్పొరేట్ వ్యక్తుల నుంచి ఏకంగా రూ.2,243 కోట్ల విరాళాలు బీజేపీకి వచ్చి పడ్డాయని, మీరు వసూళ్లు చేయకపోతే ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయో ధర్మపురి అర్వింద్ చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news