ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగనుంది. ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ టైటాన్స్ 5 విజయాలు నమోదు చేసుకొని అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. కోల్ కతా కేవలం 3 విజయాలు సాధించి ఏడో స్థానంలో ఉంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.
గుజరాత్ టైటాన్స్ జట్టు :
శుబ్ మన్ గిల్, సుదర్శన్ బట్లర్, రూథర్ పోర్డ్, షారూఖ్, తెవాటియా, రషీద్, సుందర్, కిషోర్, సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
కోల్ కతా నైట్ రైడర్స్ :
గుర్బాజ్, నరైన్, రహానె, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రస్సెల్, రమణ్ దీప్ సింగ్, అలీ, వైభవ్, హర్షిత్, వరుణ్ చక్రవర్తి.