హైదరాబాద్ నగరంలో మందు బాబులు రోజు రోజుకు వీరంగం సృష్టిస్తున్నారు. మద్యం సేవించి ఎప్పుడూ ఎక్కడ ఏం చేస్తున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. వీరి వీరంగానికి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడం విశేషం.
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ లో ఫిల్లర్ నెంబర్ 100 వద్ద ఓ మందుబాబు ఫూటుగా మద్యం సేవించాడు. మద్యం తాగి బ్రిడ్జీ పై నుంచి పడి తీగకు వేలాడుతూ కనిపించాడు. దీంతో స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు. స్థానికులు కింద కార్ బాడీ కవర్ గెట్టిగా పట్టుకుంటే దానికి మీదకు దూకి సురక్షితంగా ప్రాణాలు కాపాడుకున్నాడు. లేకుంటే ప్రాణాలు గాలిలో కలిసేవి అనే చెప్పాలి.