RCB vs KKR: కొంపముంచిన సునీల్ నరైన్.. RCB ఘోర పరాజయం

-

Kolkata Knight Riders won by 7 wkts: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మరో ఓటమిని చవిచూసింది. గెలవాల్సిన మ్యాచ్లో దారుణంగా ఓడిపోయింది. నిన్న ఆర్సిబి జట్టు పై కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్ తో… కోల్కత్తా నైట్ రైడర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ 22 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.

Kolkata Knight Riders won by 7 wkts

విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడంతో ఆర్ సి బి ఆ మాత్రం పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ జట్టు 16.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో ఏడ్ వికెట్ల తేడాతో rcb పై కేకేఆర్ విజయం సాధించింది. ఈ టోర్నమెంటులో కేకేఆర్ ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచింది. మొదట హైదరాబాద్ జట్టు పై కాగా ఇప్పుడు rcb పై విజయం సాధించింది కేకేఆర్.

Read more RELATED
Recommended to you

Latest news