కోచ్ జై సింహాపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు క్రికెటర్ల తల్లిదండ్రుల లేఖ

-

కోచ్ జై సింహాపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు లేఖ రాశారు. జనవరిలోనే కోచ్ జై సింహాపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు లేఖ రాశారట. కోచ్ జై సింహా కు పలువరు అండగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు ప్లేయర్స్ పేరెంట్స్.

coach-jaisimha suspended

తాగుడుకు బానిసైన కోచ్ జై సింహా…తమ ముందు మద్యం తాగొద్ధని పలుమార్లు వారించారట మహిళ ప్లేయర్స్. అయినప్పటికీ..తీరు మార్చుకోని కోచ్ జై సింహా…ప్రశ్నిస్తే టీంలో నుంచి తీసేస్తామని బెదిరింపులకు దిగాడట. అటు బీసీసీఐకు కూడా ఫిర్యాదు చేశారట మహిళా క్రికెట్ ప్లేయర్ పేరెంట్స్. అయితే… వారు ఫిర్యాదు చేసిన నెల రోజుల తరువాత స్పందించింది HCA. జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news