తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ, EWS, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, క్రీడాకారుల విభాగాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
వర్టికల్ రిజర్వేషన్లకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం. 56/1996 ఉత్తర్వులను రద్దు చేసింది. కాగా, KRMB మీటింగ్ కు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు దూరం అయ్యారు. శ్వేత పత్రం పేరు చెప్పి KRMB మీటింగ్ డుమ్మా కొట్టారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు KRMB మీటింగ్ కు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు దూరం అయ్యారు.