ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే తొలుత టాస్ గెలిచిన LSG బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఓడిపోయిన రాజస్థాన్ ఇవాళ లక్నోతోనైనా గెలుస్తుందా..? లేదా అని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కి రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేస్తున్నారు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరంగేట్రం చేస్తున్నారు. అతి పిన్న వయస్సులో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్ గా అతను చరిత్ర సృష్టించారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, శుభమ్ దూబె, రియాన్ పరాగ్, నితీష్ రానా, జురెల్, హెట్మేయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండె.
లక్నో సూపర్ జెయింట్స్ : మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమ్మద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్, అవేశ్ ఖాన్.