పెళ్లెప్పుడు అంటూ జర్నలిస్టు ప్రశ్న.. మను బాకర్ రియాక్షన్ ఏంటంటే?

-

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 రెండు పతకాలు గెలిచిన స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ తాజాగా తన స్వస్థలం ఝజ్జర్‌(హర్యానా)కు వెళ్లింది. అక్కడ ఆమెకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి మను.. గోశాలలో పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న మీడియాకు మనూ ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ క్రమంలో మను బాకర్ను పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడగ్గా ఆమె సిగ్గు పడింది. సిగ్గుపడుతూనే ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచన లేదని, భవిష్యత్లో దేవుడు ఏం రాసి పెట్టాడో చూడాలి అని పేర్కొంది. ప్రస్తుతం దేశం కోసం స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని, దానిపైనే తాను దృష్టి పెట్టినట్లు తెలిపింది. మరోవైపు మను బాకర్ తల్లి సుమేధా బాకర్ మాట్లాడుతూ మనుకు ఇంకా పెళ్లి వయసు రాలేదని, చిన్న పిల్లేనని వెల్లడించారు. మను చేయాల్సింది ఇంకా చాలా ఉందని తెలిపారు. ‘బాలీవుడ్‌లో నటించే ఆలోచనలు ఉన్నాయా?’ అని అడగగా.. ప్రస్తుతం తనకు నటించే ఉద్దేశం లేదని మను బాకర్ క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version