Mayank Yadav: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా… నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుస్తుంది అన్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. నిన్నటి మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. లక్నో లో క్వింటన్ డికాక్ 54 పరుగులు చేశాడు. ప రాన్ 42 పరుగులు, క్రూనాల్ పాండ్యా 43 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలో అద్భుతంగా ఆడింది. కానీ చివరికి చతికిల పడింది.
దీంతో నిర్మిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 178 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్ టీమ్. దీంట్లో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ 70 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే నిన్నటి మ్యాచ్ లో మాయాంక్ యాదవ్ 155.8 కిలోమీటర్ల వేగంతో నిప్పులు జరిగే డెలివరీలను సంధించాడు. దీంతో సోషల్ మీడియాలో మయాంక్ యాదవ్ పేరు వైరల్గా మారింది. ఢిల్లీకి చెందిన 21 సంవత్సరాల ఈ యంగ్ ప్లేయర్ లక్నో సూపర్ జెంట్స్ తరఫున ఆడుతున్నాడు. పంజాబ్ కిమ్స్ తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఈ స్పీడ్ గన్ ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన బంతిని బౌలింగ్ చేయడంతో ఈ సీజన్లో సరికొత్త రికార్డు సృష్టించాడు.