IPL 2023 : కెప్టెన్సీ మీట్ కు రోహిత్ డుమ్మా…. ఐపీఎల్ కు దూరం కానున్నాడా ?

-

ఇవాళ్టి నుంచే ఐపీఎల్ 16వ సీజన్ మొదలుకానుంది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీ కొడుతుంది. గతేడాదే లీగ్‌లో అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుజరాత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది.

అయితే, కెప్టెన్లు అందరూ ట్రోఫీ వద్ద ఫోటోషూట్ చేయగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ హాజరు కాలేదు. దీంతో అతనికి ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. నిన్న WHERE IS ROHIT అంటూ పోస్టులతో హోరెత్తించారు. అయితే అనారోగ్యం కారణంగానే రోహిత్ రాలేదని, RCB తో ఏప్రిల్ 2న జరిగే తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. కాగా, WTC ఫైనల్ ప్రపంచ కప్ నేపథ్యంలో రోహిత్ కొన్ని మ్యాచ్లకు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version